VIDEO: కల్తీ పాల బాధితులను పరామర్శించిన YS షర్మిల
E.G: రాజమండ్రిలో జరిగిన కల్తీ పాలు ఘటనలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందటం బాధాకరమని AP కాంగ్రెస్ అధ్యక్షురాలు YS షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రాజమండ్రిలో చికిత్స పొందుతున్న కల్తీ పాల బాధితులను పరామర్శించారు. కూటమి ప్రభుత్వం కల్తీతో పాలన సాగిస్తుందన్నారు. కల్తీ పాల సరఫరా వెనుక ఉన్న నిజాలు తేల్చాలని, బాధితులకు ప్రభుత్వం అండగా ఉండాలన్నారు.