రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

కృష్ణా: రహదారుల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం కోడూరు మండలంలోని ఊటగుండంలో నాబార్డ్ నిధులు రూ.రెండు కోట్ల నలభై లక్షలతో నూతన రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ భూమిపూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.