5 లక్షల చెక్కు అందజేత

JGL: కోరుట్ల మండలం సర్ఫరాజ్ పూర్ గ్రామానికిచెందిన కొక్కు నడిపి గంగారాం ఇటీవల విద్యుత్ షాక్తో మరణించారు. స్థానిక నాయకులు ఎమ్మెల్యే సంజయ్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన ఆయన విద్యుత్ అధికారులతో మాట్లాడి ప్రమాద బీమా నుంచి ఐదు లక్షల చెక్కును మంజూరు చేయించి శనివారం అతని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆయన వెంటపలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.