అధికారులను హెచ్చరించిన సబ్ కలెక్టర్

అధికారులను హెచ్చరించిన సబ్ కలెక్టర్

ELR: విధి నిర్వహణలో అలసత్వం వహించినా, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోయినా కఠినమైన చర్యలు తప్పవంటూ నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న అధికారులను హెచ్చరించారు. మండల కేంద్రమైన ముసునూరు గ్రామంలో మంగళవారం నిర్వహించిన మండల స్థాయి అధికారుల సమీక్ష సమావేశం సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు. రికార్డుల నిర్వహణ తీరు, భద్రపరిచే విధానం సరిగా లేదన్నారు.