పంప్ హౌస్ పరిసరాల్లో పులి
PDPL: లింగాపూర్ గ్రామ శివారులో పెద్దపులి అన్వేషణ కొనసాగుతోంది. ఈరోజు ఉదయం అటవీశాఖ అధికారులు లింగాపూర్ నుంచి గోదావరి పంప్ హౌస్ రోడ్డులో పులి అడుగుజాడలను గుర్తించారు. తెల్లవారుజామున గోదావరి తీరంలోని పంప్ హౌస్ పరిసరాల్లో పులి సంచారం జరిగినట్లు నిర్ధారించారు. డీఆర్వో జి. కొమరయ్య, SD రహమతుల్లా, ఎఫ్‌ఎస్‌వో పెద్దపల్లి, సింగరేణి మేనేజర్ మల్లికార్జున్, గ్రామస్థులు ఉన్నారు.