'వార్డు అభివృద్ధికి అందరూ సహకరించాలి'
MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డు అభివృద్ధికి అందరూ సహకరించాలని వార్డు కౌన్సిలర్ బోడ రాజు అన్నారు. గురువారం వార్డులోని భగత్ సింగ్ నగర్ కాలనీలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుంచి ఆయన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వార్డులో డ్రైనేజీలు, సీసీ రోడ్లు కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.