VIDEO: ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో హై టెన్షన్
NZB: ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో హైటెన్షన్ నెలకొంది. చైర్‌పర్సన్ ఛాంబర్‌లో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో కార్యాలయం రణరంగంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు తమపై దాడి చేశారంటూ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.