TDP నాయకుడి కుమారుడికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం

GNTR: వెల్దుర్తి (మం) గుండ్లపాడుకి చెందిన తోట వీరాంజనేయులుకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈయన 2022లో హత్యకు గురైన టీడీపీ నాయకుడు తోట చంద్రయ్య కుమారుడు. క్యాబినెట్ ఆమోదం మేరకు పల్నాడు కలెక్టర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో పాటు వారి కుటుంబానికి ఆర్థికంగా ప్రభుత్వం సహాయం చేయనుంది.