14న ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం

14న ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ కొత్తబయపురెడ్డి పాలెంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 14న ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం జరగనుందని ఆలయ అర్చకులు రేజేటి ఆదిశేషు ఇవాళ తెలిపారు. ఉదయం 9:02 గంటలకు ఈ కార్యక్రమం జరగనుందన్నారు. మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. భక్తులు ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు.