బలరాముడు నిర్మించిన ఆలయం ఇదే!

బలరాముడు నిర్మించిన ఆలయం ఇదే!

శ్రీకాకుళం: నాగావళి నది ఒడ్డున వెలసిన శ్రీ ఉమారుద్రకోటేశ్వర స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని సుమారు 5000 సంవత్సరాల క్రితం బలరాముడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం ప్రతి ఏటా భక్తులతో కళకళలాడుతుంది. కాగా మరికొందరు చరిత్రకారులు 1774 సంవత్సరంలో కోనాడ గ్రామానికి చెందిన బగటపల్లి కామయ్య శెట్టి ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతుంటారు.