ఘనంగా వాసవి మాత జన్మదిన మహోత్సవం

ఘనంగా వాసవి మాత జన్మదిన మహోత్సవం

అనకాపల్లిలో ఈనెల 26న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధ్యక్షుడు రవిరామ్ జవహర్ తెలిపారు. ఉదయం పల్లకి ఊరేగింపు, తిరువీధి ఉత్సవం, గోపూజ నిర్వహిస్తారన్నారు. లక్ష మల్లెపూలతో అర్చన, సామూహిక లలిత శాస్త్రనామ పారాయణం, 102 రకాల స్వీట్లతో నైవేద్యం సమర్పిస్తారన్నారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వెండి రథంపై ఊరేగిస్తారని పేర్కొన్నారు.