VIDEO: విద్యార్థి సంఘాల పై దాడులు చేయడం సిగ్గుచేటు: నరేష్
HNK: జిల్లా కేంద్రంలో శుక్రవారం ABSF జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి సంఘాలపై ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు దాడులకు పాల్పడటం, ఇష్టానుసారం మాట్లాడటం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్కూళ్లు ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడతామని స్పష్టం చేశారు.