జాతరలో ఆకట్టుకున్న కర్ణాటక కోలాటాలు
SRD: కంగ్టి సిద్దేశ్వర జాతర మహోత్సవంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆధ్యాత్మిక భజనల కోలాటాలు ఆకర్షణీయంగా నిలిచాయి. పక్కనే ఉన్న కర్ణాటక ఔరా తాలూకా సుందాళ్‌కు చెందిన నీలకంటి సమాజ్ వారి ఆధ్వర్యంలో కోలాటాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ గ్రామస్తుల ప్రోత్సాహంతో వారు కోలాటాలు అతి ఉత్సాహంగా ప్రదర్శించారు. దీంతో కంగ్టి భక్తి సాగరమైంది.