పేరుపాలెం బీచ్‌కు పోటెత్తిన పర్యాటకులు

పేరుపాలెం బీచ్‌కు పోటెత్తిన పర్యాటకులు

W.G: మొగల్తూరు మండలంలోని పేరుపాలెం బీచ్ ఆదివారం పర్యాటకులతో కిక్కిరిసింది. సెలవు రోజు కావడంతో జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు భారీగా విచ్చేశారు. కుటుంబ సమేతంగా సముద్ర స్నానాలు చేస్తూ.. యువకులు తీరంలో ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొగల్తూరు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. పర్యాటకుల సందడితో కోలాహలంగా మారింది.