నేడు రెండు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ప్రారంభం

TG: హైదరాబాద్ నగరంలో కొత్తగా రెండు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ వీటిని ప్రారంభించనున్నారు. ఇందులో ఒకటి రాయదుర్గంలో, మరొకటి ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో ఏర్పాటు చేశారు. ఈ కొత్త కేంద్రాల ఏర్పాటుతో హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు పాస్‌పోర్ట్ సేవలు మరింత సులభతరం కానున్నాయి.