హరీష్ రావుకు అబద్ధాల అవార్డు ఇవ్వొచ్చు: ఎమ్మెల్యే
RR: తెలంగాణలో మాజీ మంత్రి హరీష్ రావు పెద్ద బ్లాక్ మెయిలర్‌గా మారారని, అబద్ధాల అవార్డును ఇవ్వొచ్చని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. 80% పనులు పూర్తయ్యాయన్న వారి వ్యాఖ్యలు ప్రజలను మోసం చేయడమేనన్నారు.