జిల్లాలో 22.55% ఓటింగ్ నమోదు
MBNR: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల సమయానికి 22.55% పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పోలింగ్ మందకోడిగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో 8 గంటల తర్వాత ఓటర్లు రాక మొదలైంది. పోలింగ్ కేంద్రానికి ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులను జాగ్రత్తగా కేంద్రంలోకి తీసుకెళ్లి ఓటు వేయిస్తున్నారు.