'అన్నదాత సుఖీభవ పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి'
గుంటూరు జిల్లా రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సుధీర్ బాబు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పంటల నమోదు గడువు మంగళవారంతో ముగిసిందని, వివరాలు అప్లోడ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. యంత్ర పరికరాల కోసం యాప్లో బుక్ చేసుకోవాలని, e-KYC నమోదు చేసుకోవాలని, ప్రభుత్వ సహకారం కోసం ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.