రాష్ట్ర ఎంపీలపై షర్మిల ఫైర్
AP: పార్లమెంట్ సమావేశాల వేళ రాష్ట్ర ఎంపీల మౌనంపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రం నుంచి 25 మంది లోక్‌సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారని గుర్తుచేశారు. వీరంతా రాష్ట్ర హక్కులపై మాట్లాడతారని చూస్తున్నామని, ఏమీ మాట్లాడకుండా బుద్ధిమంతులుగా కూర్చుంటున్నారని ఎద్దేవా చేశారు. మోదీ మాట్లాడితే పోటీపడి చప్పట్లు కొడుతున్నారని విమర్శించారు.