వేసవికి వాటర్ టెన్షన్ లేనట్లేనా..!
VSP: జిల్లాలో వచ్చే వేసవిలో నీటి కొరత ఉండదని GVMC అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నగరానికి తాగునీరు అందించే ఏలేరు, రైవాడ, మేఘాద్రి, తాటిపూడి, గోస్తనీ, ముడసర్లోవ, గంభీరం రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలతో కనీసం 6 నెలల పాటు నిరంతర నీటి సరఫరా చేయగలమన్నారు. వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి వినియోగంపై పర్యవేక్షణ చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.