రోడ్డు పూర్తిచేయాలని గిరిజనుల డిమాండ్
ASR: అనంతగిరి(M) ధనుకోట గ్రామంలో ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైన రోడ్డు పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొంథా తుఫాన్ సమయంలో వరదల కారణంగా రోడ్డు పూర్తిగా దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులు స్వయంగా గుంతలు పూడ్చుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.