వైట్ హౌస్‌లో మెలానియా ట్రంప్ సందడి

వైట్ హౌస్‌లో మెలానియా ట్రంప్ సందడి

వైట్ హౌస్‌లో జరిగిన సదస్సులో అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, 'ఫిగర్ 3' అనే హ్యూమనాయిడ్ రోబోతో కలిసి నడిచారు. ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం వంటి పనులు ఈ రోబో స్వయంగా చేస్తుంది. డిజిటల్ భద్రత, విద్యపై జరిగిన ఈ సదస్సులో ఫ్రాన్స్ ఫస్ట్ లేడీ బ్రిగిట్టే మాక్రాన్‌తో పాటు 40 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ అరుదైన దృశ్యం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.