పారిశుద్ధ్య పనులును పరిశీలించిన ఛైర్‌పర్సన్
KMM: సత్తుపల్లి పట్టణంలోని 1వ వార్డులో సాగుతున్న డ్రైనేజ్ క్లినింగ్ పనులను సత్తుపల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్ రిహానా కమల్ పాషా, మున్సిపల్ కమిషనర్ నరసింహ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక కౌన్సిలర్ మట్టా ప్రసాద్‌తో కలిసి వార్డులోని పలు వీధుల్లో పర్యటించి, పారిశుద్ధ్య పనుల తీరును స్వయంగా అడిగి తెలుసుకున్నారు.