ముదిగొండ ఆసుపత్రి పనులను పరిశీలించిన భట్టి
TG: ఖమ్మం జిల్లా ముదిగొండలో నిర్మాణంలో ఉన్న 30 పడకల ఆసుపత్రి భవన పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు త్వరగా అందుబాటులోకి రావాలంటే పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని ఆదేశించారు.