నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
SKLM: ఎచ్చెర్లలో ఉన్న యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఏప్రిల్ 2వ తేదీ నుండి ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీలో 30 రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ రాంజీ మంగళవారం తెలిపారు. శిక్షణా కాలంలో ఉచిత వసతి, భోజనం సదుపాయం కల్పించబడునన్నారు. రిజిస్ట్రేషన్ కొరకు 7993340407, 9553410809 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.