నేడు 'స్త్రీ శక్తి పథకాన్ని' ప్రారంభించనున్న మంత్రి

VZM: రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్‌లో ప్రారంభించనున్నారు. ఈ మేరకు రెండు డిపోలకు సంబంధించిన 160 బస్సులు నడుస్తుండగా మహిళల ఉచిత ప్రయాణం కోసం137 బస్సులు వినియోగించనున్నారు. ఉచిత బస్సుల ద్వారా 21,500 మంది ప్రయాణం చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.