ఈనెల 6న ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం

ఈనెల 6న ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం

ప్రకాశం: కనిగిరిలోని అమరావతి గ్రౌండ్ వద్ద ఈనెల 6వ తేదీన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1: 00 వరకు ఈ వైద్య పరీక్షలు జరుగుతాయన్నారు. ఎంతో ఖరీదైన మాయోగ్రఫీ టెస్ట్ ఉచితంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.