బంగారం దొంగ అరెస్ట్
ప్రకాశం: కొండపి(M) జాల్లపాలెంలో ఈనెల 7న రామలక్ష్మి పొలం పనులకు వెళ్లగా ఇంటితాళం పగలగొట్టి 9.25 సవర్ల బంగారం దొంగిలించారు. ఆమె ఫిర్యాదు మేరకు కొండపి సీఐ సోమశేఖర్, కేసు దర్యాప్తు చేసి పొదిలి (మం) ఏలూరుకు చెందిన చిన్నపరెడ్డి వినయ్ కుమార్ రెడ్డిని జాళ్ళపాలెం రోడ్డులో అదుపులోకి తీసుకొన్నారు. అతని వద్ద నుంచి సొమ్మును రికవరీ చేశారు. ఈ మేరకు డీఎస్పీ బాలసుబ్రమణ్యం వివరాలు వెల్లడించారు.