VIDEO: చిత్తడిగా మారిన పోచ్చర-బండలనాగపూర్ రోడ్డు

VIDEO: చిత్తడిగా మారిన పోచ్చర-బండలనాగపూర్ రోడ్డు

ADB: తాంసి మండలం పోచ్చర గ్రామం మీదుగా బండలనాగపూర్ వెళ్లే రోడ్డు మార్గం ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా చిత్తడిమయమైంది. రోడ్డు బురదమయం కావడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జారిపడి ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, వేగంగా మరమ్మతు పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.