VIDEO: జింఖానా గ్రౌండ్ వద్ద బారులు తీరిన క్రీడాకారులు
HYD: సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్ వద్ద క్రికెట్ అండర్-14 సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ మేరకు గ్రౌండ్ వద్ద యువ క్రీడాకారులు బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచే క్యూలో నిలబడి ఎదురుచూస్తున్నారు. వాళ్లకి ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్లు చోద్యం చూస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.