'రాజ్యాంగం ద్వారానే హక్కులను సాధించుకోవాలి'
ADB: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే హక్కులను సాధించుకోవాలని మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మనోజ్ కుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలో అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ సాధనలో అమరవీరుల త్యాగాలు మరువలేని అని పేర్కొన్నారు. నాయకులు రాందాస్, ప్రసన్నకుమార్, నరసింహులు తదితరులున్నారు.