టిప్పర్ ఢీ కొని రైతుకు తీవ్ర గాయాలు
NLG: నల్గొండ మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. చందనపల్లికి చెందిన రైతు బండ ఇంద్రారెడ్డిని స్కూటీపై వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. నల్గొండ వైపు వస్తుండగా వేగంగా వచ్చిన టిప్పర్ ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. 108కి సమాచారం అందించి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.