తీరని నష్టాన్ని మిగిల్చిన అకాల వర్షం

తీరని నష్టాన్ని మిగిల్చిన అకాల వర్షం

SDPT: అకాల వర్షం తీరని నష్టాన్ని కలిగించింది. సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి పలు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం బస్తాలు తడిసిముద్దయ్యాయి. హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసి పోయింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ధాన్యమంతా నీటిపాలైందని రైతులు ఆవేేదన వ్యక్తం చేస్తున్నారు.