రాకాసి అలలు వస్తుంటాయి జాగ్రత్త...!

రాకాసి అలలు వస్తుంటాయి జాగ్రత్త...!

కృష్ణా: హంసలదీవి బీచ్‌కు వచ్చిన పర్యాటకులకు పాలకాయ తిప్ప మెరైన్ ఎస్ఐ ఉజ్వల్ ఆదివారం పలు సూచనలు చేశారు. సముద్ర తీరంలో స్నానాలు చేసేటప్పుడు రాకాసి అలలు వస్తాయని, సముద్రంలో గుంతలు ఉంటాయని, వృద్ధులను, పిల్లలను ఒంటరిగా సముద్ర తీరంలో వదలరాదని హెచ్చరించారు. తీరం వెంబడి మెరైన్ సిబ్బంది గస్తీ నిర్వహించారు.