షార్ట్ సర్క్యూట్‌తో మొక్కజొన్న పంట దగ్ధం
NRML: లక్ష్మణచాంద సమీపంలో మునిపెల్లి వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా అయిండ్ల లావణ్య అనే రైతుకు చెందిన అర ఎకరం మొక్కజొన్న పంట దగ్ధమైంది. ట్రాన్స్ఫార్మర్ వద్ద రాపిడికి గురైన 11కేవీ విద్యుత్ తీగల నుండి కోసి కుప్పలుగా వేసిన పంటపై నిప్పురవ్వలు పడి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో రైతు సుమారు రూ.50వేల వరకు నష్టపోయినట్లు సమాచారం.