గట్టు మండలంలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

GDWL: గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలో శనివారం జిల్లా కలెక్టర్ సంతోష్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన అంగన్వాడీ కేంద్రంలోని ఆరోగ్య ప్రమాణాలను, విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి అని అధికారులు ఆదేశించారు.