VIDEO: బుచ్చి కౌన్సిల్ భేటీలో వాటర్ వార్: కమిషనర్ vs కౌన్సిలర్
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం కౌన్సిల్ సమావేశంలో నీటి సరఫరాపై రచ్చ జరిగింది. 17వ వార్డులో నీటి సరఫరా సమయాన్ని గంట పెంచాలని కౌన్సిలర్ వైష్ణవి కోరగా, కమిషనర్ బాలకృష్ణ నిరాకరించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రజల సౌకర్యం కోసం అడిగితే కాదనడంపై కౌన్సిలర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.