ఎర్రచందనం దొంగలు అరెస్ట్

ఎర్రచందనం దొంగలు అరెస్ట్

ప్రకాశం: కొమరోలు మండలం గుంతపల్లె గ్రామ సమీపంలో గురువారం ఎర్రచందనం తరలిస్తున్న ముగ్గురిని తిరుపతి టాస్క్‌ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 26 ఎర్రచందనం దుంగలు ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మీడియాకు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ.25 లక్షలు ఉంటుందని తెలిపారు.