జాబ్ మేళాలో పలువురికి ఉద్యోగాలు..!
W.G: పాలకొల్లు శ్రీ ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ కళాశాలలో సోమవారం ప్లేస్మెంట్ సెల్, జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించినట్లు ప్రిన్సిపల్ టి. రాజరాజేశ్వరి తెలిపారు. ఈ మేళాలో 76 మంది విద్యార్థులు పాల్గొనగా 67 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొని వివిధ పరీక్షలు నిర్వహించి, ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు.