'యోగా వల్ల విద్యార్థులకు క్రమశిక్షణ సాధ్యమవుతుంది'
KMM: మధిర మండలం మడుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం యోగ టీచర్ కృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. యోగ సాధన వల్ల విద్యార్థులకు మానసిక, ప్రశాంతత, ఏకాగ్రత, శారీరిక దృఢత్వం, విషయ పరిశీలన శక్తి పెంపుదల, వ్యక్తిగత క్రమశిక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. ఎంతో విలువైన ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.