రోడ్డు ప్రమాదంలో ముగ్గురికీ తీవ్ర గాయాలు

SKLM: సారవకోట మండలం బొంతు జంక్షన్ వద్ద రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురికీ గాయాలయ్యాయి. శుక్రవారం బొంతు జంక్షన్ నుంచి హిరమండలం వైపు ద్విచక్ర వాహనంపై రాజేష్,దుర్గాప్రసాద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం వీరిని ఢీకొంది. ఈ ఘటనలో దుర్గాప్రసాద్ కాలు పూర్తిగా విరిగిపోయింది. స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.