ధరూరు-కోట్‌పల్లి రోడ్డులో గుంతలు

VKB: ధరూర్ మండల కేంద్రం నుంచి కోట్‌పల్లి ప్రాజెక్టుకు వెళ్లే రోడ్డు దారుణ దుస్థితిలో ఉందని స్థానికులు తెలిపారు. ఈద్గా దాటిన తర్వాత మూల మలుపు దగ్గర రోడ్డు గుంతలు పడి దాదాపు సంవత్సరం అవుతుంది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో వందలాదిగా వచ్చే పర్యాటకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రోడ్డును వెంటనే మరమ్మతు చేయాలని కోరుతున్నారు.