'తల్లిపాలు బిడ్డకు రోగ నిరోధక శక్తి పెంచుతుంది'

VZM: తల్లిపాలు బిడ్డకు రోగ నిరోధక శక్తిని పెంచుతుందని తల్లి పాల సంస్కృతి ప్రోత్సాహానికి ప్రాధాన్యత ఇద్దామని ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. శనివారం ఎల్. కోట గ్రామంలో ICDS కార్యాలయంలో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు ఆగస్టు 1 నుంచి 7 వరకు కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పుట్టిన బిడ్డకు వెంటనే తల్లిపాలు ఇవ్వాలని సూచించారు.