వచ్చే నెల 6న జిల్లాకు రానున్న కేటీఆర్

వచ్చే నెల 6న జిల్లాకు రానున్న కేటీఆర్

BDK: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే నెల జిల్లాలో పర్యటించనున్నారని BRS నాయకులు దిండిగాల రాజేందర్ వెల్లడించారు. ఇల్లెందులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే 6న కొత్తగూడెం, భద్రాచలంలో కేటీఆర్ పర్యటిస్తారని తెలిపారు. ఆయన పర్యటన విజయవంతానికి ఈ నెల 24న కొత్తగూడెంలోని BRS జిల్లా కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.