బుట్టాయిగూడెంలో అవిశ్వాస సెగ.. వైస్ ఎంపీపీపై తీర్మానం
ELR: బుట్టాయిగూడెం మండల పరిషత్ రాజకీయ వేడి మొదలైంది. వైస్ ఎంపీపీ-1 కుక్కల వరలక్ష్మిపై మెజారిటీ ఎంపీటీసీ సభ్యులు ఇవాళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. వైస్ ఎంపీపీ-2 గుగ్గులోతు మోహనరావు నేతృత్వంలో వారు అవిశ్వాస తీర్మాన పత్రాన్ని ఎంపీడీవో కె. జ్యోతికి అందజేశారు. సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తదుపరి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో తెలిపారు.