'పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి'
పార్వతీపురం మండలం చినబొండపల్లిలో శుక్రవారం ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఆర్డీఏ పీడీ, మండల ప్రత్యేక అధికారి ఏం.సుధారాణి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాచి చల్లార్చిన నీరు తాగాలని, దోమతెరలు వినియోగించాలని తెలిపారు. అంతకముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.