70కు పైగా కేసులు.. పీడీ యాక్ట్ నమోదు
ఆదిలాబాద్‌లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న మొయిజ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. గత 15 సంవత్సరాల్లో దాదాపు 70 కేసుల్లో ప్రధాన నిందితుడైన అతను, 2019లో కూడా పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లాడు. విడుదలైన తర్వాత కూడా మార్పు లేకుండా మళ్లీ నేరాలకు పాల్పడడంతో ఎస్పీ అఖిల్ మహాజన్ సిఫార్సుతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నారు.