VIDEO: ఘనంగా చిన్న కొట్టాయి ఉత్సవం

TPT: వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో ఏటా చిన్న కొట్టాయి ఉత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా కోట మండపం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వట్టి వేర్లతో చలువ పందిళ్లు వేసి అందులో కొలువుదీర్చారు. అనంతరం విశేష పూజలు నిర్వహించారు.