తిరునాళ్లలో పాల్గొన్న శోభారాణి జూలకంటి
PLD: వెల్దుర్తి మండలం, శిరిగిరిపాడు గ్రామంలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్ల సందర్భంగా జూలకంటి శోభారాణి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూ.15 లక్షలతో ఏర్పాటు చేస్తున్న తాగునీటి బోరు, పైపులైన్ పనులను పరిశీలించారు. గ్రామ ప్రజలకు మెరుగైన తాగునీటి సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.