అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టుకున్న పోలీసులు
BHPL: మహాదేవపూర్ మండల కేంద్రం నుండి అక్రమంగా తలిస్తున్న నాలుగు క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఎస్సై పవన్ కుమార్ వివరాల ప్రకారం భూపాలపల్లికి చెందిన పొన్న శ్రీనివాస్, పొన్న రాజేష్ అనే వ్యక్తులు ఓమ్ని వాహనంలో అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా పిడిఎఫ్ బియ్యం పట్టుబడ్డట్లు తెలిపారు.